ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ వైపు ముంపు... మరోవైపు బ్లాస్టింగ్​.. దాల్మియాతో కష్టాలు - దాల్మియా కర్మాగారం వల్ల కూలుతున్న బతుకులు

DALMIA CEMENTS: సీఎం జగన్‌ సొంత జిల్లాలోని దాల్మియా సిమెంట్ కర్మాగారం.. మైలవరం మండలం కొమ్మెర్ల గ్రామస్థులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వాగులు, వంకలకు.. అడ్డంగా ప్రహరీ గోడ నిర్మించడం వల్ల గ్రామం ముంపునకు గురవుతోంది. గ్రామానికి సమీపంలో చేస్తున్న బ్లాస్టింగ్‌ల కారణంగా ఇళ్లు నెర్రలు చీలి కూలిపోయే దశకు చేరాయి. దాల్మియా యాజమాన్యంపై అధికార పార్టీకి చెందిన నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు.

DALMIA CEMENTS
DALMIA CEMENTS

By

Published : Jul 23, 2022, 12:50 PM IST

దాల్మియా కర్మాగారం వల్ల కూలుతున్న బతుకులు

DALMIA CEMENTS: వైఎస్సార్​ జిల్లా మైలవరం మండలం చిన్నకొమ్మెర్ల గ్రామ సమీపంలో 13 ఏళ్ల క్రితం దాల్మియా సిమెంట్ కర్మాగారాన్ని నిర్మించారు. వంకలు వాగులను లెక్క చేయకుండా.. ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంతో సమీప గ్రామాలకు సమస్యలు తలెత్తాయి. ఏటా వర్షాకాలంలో వరద నీరు దుగ్గనపల్లె, నవాబుపేట గ్రామాల్ని ముంచెత్తుతోంది. సుమారు 13వందల ఎకరాలు నీటమునుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. సమస్యను దాల్మియా యాజమాన్యం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

కర్మాగారం కోసం గ్రామానికి సమీపంలో ఇష్టానుసారం క్వారీలో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇళ్లన్నీ నెర్రలు చీలి ప్రమాదకరంగా మారాయి. కష్టకాలంలో కనీసం ఉపాధి కూడా చూపించడం లేదని మహిళలు వాపోతున్నారు. మాజీమంత్రి, వైకాపా నాయకుడు రామసుబ్బారెడ్డికి 2 గ్రామాల ప్రజలు తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇటీవలే జమ్మలమడుగు ఆర్డీవోను కలిసి.. సమస్యను వివరించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. దాల్మియా సిమెంటు కర్మాగారం వల్ల 2గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలపై.. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకుంటామని జమ్మలమడుగు ఆర్డీవో చెబుతున్నారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details