ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హులందరికి పింఛన్లు అందిస్తాం: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ - pensions are given to all eligible candidates says ycp mla

పేదలకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేయదని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. పింఛన్ తీసుకుంటున్న ధనవంతులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

pensions are given to all eligible candidates kadapa mla rachamallu shivaprasad
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు

By

Published : Feb 3, 2020, 3:12 PM IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు

అర్హులందరికీ పింఛన్ వస్తుందని..., పేదలకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేయదని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. పురపాలక కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పింఛన్ల విషయంలో తెదేపా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. పింఛన్ తీసుకుంటున్న ధనవంతులను తొలగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. సాంకేతిక లోపం, ఉద్యోగస్థులు చేసిన పొరపాట్ల వల్ల పింఛను రాక పోతే వాటిని సరిచేసి మళ్లీ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:నీరుగారుతున్న మంచినీటి పథకాల లక్ష్యం..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details