కొన్నేళ్ల నుంచి తీసుకుంటున్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను రద్దు చేయడం దారుణమని వృద్ధులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తీసేసిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ... కడప కార్పొరేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు ధర్నా చేపట్టారు. చేతిలో పింఛన్ల పుస్తకాలు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంట్లో ఎంతమంది అర్హులుంటే వారందరికీ పింఛన్లు ఇస్తామని ఓట్లు వేయించుకునేటప్పుడు చెప్పిన జగన్..... ఇప్పుడు ఇల్లు, కరెంట్ బిల్లులను సాకుగా చూపడమేంటని మండిపడ్డారు.
కడపలో పింఛన్దారులు కన్నీరు మున్నీరు - pensioners under CPI-led agitation in Kadapa
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పింఛను నేరుగా ఇంటి వద్దకే చేరవేస్తున్నామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే కిందటి నెల వరకూ పింఛను పొందిన చాలామంది అర్హుల పేర్లు కొత్త జాబితాలో కనిపించకపోయేసరికి గందరగోళం నెలకొంది. చేతికి పింఛను వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూసిన చాలామంది నిరాశలో మునిగిపోయారు. పింఛన్లు ఇవ్వకపోవటంపై కడపలో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ధర్నా చేపట్టారు.
![కడపలో పింఛన్దారులు కన్నీరు మున్నీరు pensioners under CPI-led agitation in Kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5964208-783-5964208-1580895011631.jpg)
సీపీఐ ఆధ్వర్యంలో కడపలో పింఛన్దారులు ఆందోళన
సీపీఐ ఆధ్వర్యంలో కడపలో పింఛన్దారులు ఆందోళన
ఇవీ చదవండి...కొత్త నిబంధనలతో కష్టాలు..పింఛను రాక వృద్ధుల రోదన