ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగోసారి తెగిన పెన్నా నది అప్రోచ్ రోడ్డు.. 16 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు

Penna River Bridge: వైస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నా నదిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు నాలుగోసారి తెగిపోవడంతో 16 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎగువన కురిసిన వానలకు గండికోట, మైలవరం జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో అధికారులు మైలవరం డ్యాం నుంచి నీటిని పెన్నాకు విడుదల చేయగా నీటిఉద్ధృతికి తట్టుకోలేక అప్రోచ్ రోడ్డు తెగిపోయింది.

Penna River
పెన్నా నది

By

Published : Dec 19, 2022, 4:38 PM IST

Penna River Bridge: పెన్నా నదిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు నాలుగోసారి తెగిపోవడంతో 16 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎగువన కురిసిన వానలకు గండికోట, మైలవరం జలాశయాలు నిండుకుండలా మారాయి. మైలవరం డ్యాం నుంచి 9000 వేల క్యూసెక్కుల నీటిని పెన్నాకు విడుదల చేశారు. ఆ నీటి ఉద్ధృతికి అప్రోచ్ రోడ్డు తట్టుకోలేదని అధికారులే రెండు చోట్ల గండి కొట్టి నీటిని మళ్లిస్తున్నారు.

వైస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నా నదిపై గతంలో హై లెవెల్ వంతెన నిర్మించారు. గతేడాది నవంబర్ 22వ తేదీన మైలవరం జలాశయం నుంచి పెన్నాకు లక్షా 55 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఒక స్తంభం ఒరిగిపోయింది. అప్పటినుంచి రాకపోకలు నిలిపివేశారు. ప్రజల కోసం పక్కనే అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేసి... తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వంతెన పనుల గురించి పట్టించుకోలేదు. అదే నెలలో భారీ వర్షాల కారణంగా వంతెన రెండుసార్లు తెగి పోయింది. మళ్లీ డిసెంబర్​లో తుపాను కారణంగా రెండు సార్లు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.

నాలుగోసారి తెగిపోయిన పెన్నా నది అప్రోచ్ రోడ్డు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details