కడప జిల్లాలో పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ఈ నెల10వ తేదీ నుంచి నీటి ప్రవాహం రోజు రోజుకు పెరుగుతోంది. 10,520క్యూసెక్కులు ఉన్న నీటి ప్రవాహం18వేల క్యూసెక్కులకు పెరిగింది.ఈరోజు మధ్యాహ్నానికి18వేల800క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా వస్తున్న నీరు అంతా నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానకి చేరుతోంది.పెన్నా నదిలో నీరు ప్రవహిస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.వరినాట్లు వేశారు.
'పెన్నా'లో పెరిగిన నీటి వరద - పెన్నా
కడపజిల్లాలో పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ఈ వరదనీరంతా నెల్లూరు జిల్లా సోమశీల జలాశయానికి చేరడంతో రైతులు వ్యవసాయ పనులుకు శ్రీకారం చూట్టారు.
పెన్నానదిలో ప్రవహిస్తోన్న నీరు