కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో పెన్నా నది ప్రవహిస్తోంది. ఇసుక అక్రమ రవాణాతో ఈ ప్రాంతంలోని నది రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం డంపింగ్ యార్డ్ లా మారింది . మున్సిపాలిటీలోని చెత్తతోపాటు ఇతర వ్యర్థాలు పడేస్తున్నారిక్కడ. దీని వల్ల ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. అటుగా వెళ్లాలంటే దుర్గంధంతో ఊపిరాడని పరిస్థితి ఉంది. ఫలితంగా... భూగర్భ జలాలూ కలుషితమయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
పెన్నా తీరం ..... వ్యర్థాలమయం - పెన్నా
పెన్నా తీరం డంపింగ్ యార్డును తలపిస్తోంది. ఎటు చూసిన చెత్తాచెదారంతో హీనంగా తయారైంది. ఇళ్లలోని వ్యర్ధాలు, ప్లాస్టిక్ కాగితాలు, కోళ్ల వ్యర్ధాలు, నాపరాళ్ళు... అధికారుల నిర్లక్ష్యానికి ససాక్ష్యంగా కనిపిస్తున్నాయి.
penna coast
కృష్ణా జలాలు మైలవరం చేరినప్పుడు అక్కడి జలాశయం నుంచి తాగు, సాగు నీటి కోసం పెన్నా నదికి నీళ్లు వదులుతుంటారు. అలా వదిలినప్పుడు భూగర్భ జలాలు వాటితో కలిసి కలుషితమవుతాయి.