ursu festival in kadapa pedda dargah: కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు.. నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి 8గంటలకు.. దర్గా పీఠాధిపతి అరిఫుల్లా హుస్సేన్ మాలింగ్ షాను.. పీరి స్థానంలో కూర్చోబెడతారు. ఆయన మూడు రోజుల వరకు అలాగే కదలకుండా కూర్చుంటారు. రాత్రి 10 గంటలకు పీఠాధిపతి తన నివాసం నుంచి గంధం తీసుకొచ్చి.. దర్గా ఆవరణలో చదివింపులు ఇస్తారు.
రేపు ఉరుసు మహోత్సవం నిర్వహిస్తారు. కరోనా మూడో విడత దృష్ట్యా.. 78వ జాతీయ కవి సమ్మేళనం, ఖవాలీ, ఎగ్జిబిషన్ వివిధ రకాల దుకాణాలను రద్దు చేసినట్లు దర్గా మేనేజర్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఉరుసు కార్యక్రమాలన్నీ ఏకాంత సేవలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.