ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతి సంబరాల్లో .. పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి.. - ఏపీ కాంగ్రెస్ వార్తలు

PCC Media Chairman Tulsi Reddy: పీసీసీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకొన్నారు. గాలిపటాలు ఎగరేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు మానవ జీవితంలో అంతర్భాగమని, మనుషుల మధ్య ప్రేమలు అనుబంధాలు, ఆప్యాయతలు పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయని ఆయన అన్నారు.

PCC Media Chairman Tulsi Reddy
పీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి

By

Published : Jan 15, 2023, 6:46 PM IST

గాలిపటాలు ఎగరేసి శుభాకాంక్షలు తెలిపిన తులసిరెడ్డి

PCC Media Chairman Tulsi Reddy: మకర సంక్రాంతి సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలో పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి కుటుంబసభ్యులతోపాటుగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గాలి పటాలు ఎగరవేశారు. తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలు మానవ జీవితంలో అంతర్భాగమని ఆయన అన్నారు. మనుషుల మధ్య ప్రేమలు అనుబంధాలు, ఆప్యాయతలు పెంచడంలో పండుగలు ప్రముఖ పాత్ర వహిస్తాయని తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతి బింబాలని తులసి రెడ్డి వెల్లడించారు. మకర సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ అని వెల్లడించారు.. ప్రకృతికి, మనిషికి మధ్య ఉండే అనుబంధాన్ని వ్యక్తీకరించేదే సంక్రాంతి పండుగని తులసిరెడ్డి తెలిపారు. ఈ సంక్రాంతి పండగను తెలుగు ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details