సీమలో పవన్ పర్యటన! - పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటన ఖరారు అయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భవిష్యత్తు కార్యచరణ పై ముఖ్యనేతలతో జనసేనాని చర్చించనున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 21,22,23 తేదీల్లో కర్నూలు జిల్లా, 25,26,27 తేదీల్లో కడప జిల్లా, ఫిబ్రవరి 28, మార్చి 1,2 తేదీల్లో చిత్తూరు జిల్లాలోనూ పవన్ పర్యటించనున్నారు. త్వరలోనే వివరాలను పార్టీ వర్గాలు వెల్లడించనున్నాయి. నేతలు, కార్యకర్తలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. యురేనియం, ఉక్కు పరిశ్రమను పరిశీలించడంతో పాటు...కేసీ కెనాల్ ను సందర్శించి ఆయకట్టు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రాయలసీమ సాగు జలాలపై, భవిష్యత్ కార్యచరణపై ప్రత్యేకంగా ముఖ్య నేతలతో జనసేనాని చర్చించనున్నారు. మేనిఫెస్టోకు అనుగుణంగా సీమ జిల్లాల ప్రధాన సమస్యలు చేర్చే అవకాశం ఉంది.