కడప జిల్లా ఎర్రగుంట్ల మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆవరణలోని చెట్ల కింద వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రిలో మరమ్మతులు జరుగుతుండడం వల్ల ఆరుబయటే చికిత్స అందిస్తున్నామని వైద్య సిబ్బంది తెలిపారు. పనులు జరుగుతున్న కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆసుపత్రిలో చీకటిగా ఉందని బెడ్లు బయటవేసి చికిత్స అందిస్తున్నామని సిబ్బంది అంటున్నారు.
ఆసుపత్రి వెనుకవైపు ఆయుష్ రూమ్ ఉందని అక్కడ వైద్యం చేస్తే బాగుంటుందని రోగులు అంటున్నారు. చెట్ల కింద వైద్యం చేయడంతో చికిత్స కోసం వచ్చిన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీగా ఉన్న ఆయుష్ రూమ్లో వైద్య చేయకపోవడాని కారణమేమిటో తెలియడం లేదని ప్రజలు అంటున్నారు. ఒక వేళ వర్షం వస్తే రోగుల పరిస్థితి ఏమిటని వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు చెబుతున్నారు. పనులు పూర్తయ్యే వరకు వేరొక సదుపాయం కల్పించాలని రోగులు కోరుతున్నారు.