కళ్లైనా తెరవకముందే ఇద్దరు పసికందులు కరోనాతో పోరాడుతున్నారు. కడప జిల్లా చాపాడు మండలం ఖాదర్ పల్లికి చెందిన గర్భిణి 2 రోజుల క్రితం కవలలకు జన్మనిచ్చి కన్నుమూసింది. అనంతరం జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాటినుంచీ ఇద్దరు శిశువులను రిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ తరుణంలో రిమ్స్‌ను సందర్శించిన జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ.. పిల్లలకు అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలని వైద్యులకు సూచించారు.
కళ్లైనా తెరవకముందే కరోనాతో కవలల పోరాటం - pagency lady dead with corona two days back in kadapa
కడపజిల్లా చాపాడు మండలం ఖాదర్ పల్లికి చెందిన ఓ గర్భిణి కవల పిల్లలకు జన్మనిచ్చి చనిపోయింది. అనంతరం ఆమెకు పరీక్షచేయగా కరోనా వచ్చింది. పసి పిల్లలను రిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు వెళ్లిన జాయింట్ కలెక్టర్ సాయికాంత్ ప్రత్యేక శ్రద్ధతో వైద్య చికిత్సలు అందించాలని రిమ్స్ వైద్యాధికారులను ఆదేశించారు.
![కళ్లైనా తెరవకముందే కరోనాతో కవలల పోరాటం కళ్లైనా తెరవకముందే కరోనాతో కవలల పోరాటం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7594676-941-7594676-1592000806643.jpg)
కళ్లైనా తెరవకముందే కరోనాతో కవలల పోరాటం