ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ జకియా ఖానంతో కలిసి రాయచోటిలో ప్రజా చైతన్య ర్యాలీ నిర్వహించారు. ప్రతి పక్ష నేత హోదాలో జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిందన్నారు. రానున్న కాలంలో మరెన్నో పథకాలను తీసుకొచ్చి పేదల మోహంలో చిరునవ్వులు చూడాలన్నదే... ప్రభుత్వ లక్ష్యం అన్నారు. స్థానిక వైకాపా కార్యాలయం నుంచి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పురపాలిక గ్రామ సచివాలయ సిబ్బంది అభిమానులతో నేతాజీ కోడలి బస్టాండ్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలిలోని వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్రలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలోనూ జగనన్న ఇచ్చిన హామీలు 17 నెలల పాలనా కాలంలోనే 90 శాతంకు పైగా నెరవేర్చి ప్రజా పాలన సాగిస్తున్నారు.
కడప జిల్లాలో వైకాపా శ్రేణుల పాదయాత్రలు - కడప జిల్లాలో వైకాపా పాదయాత్ర వార్తలు
ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ అమలు చేశారని వైకాపా ఎమ్మెల్యేలు అన్నారు. ప్రజాసంకల్పయాత్ర పూర్తయి మూడేళ్లైన సందర్భంగా కడప జిల్లాలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు.
రైల్వే కోడూరు మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహా సంకల్ప పాదయాత్రకు మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రైల్వే కోడూరు మండలం యస్.ఉప్పరపల్లి నుంచి మాధవరం పోడు, మైసూర్ వారి పల్లి, రైల్వేకోడూరు టౌన్ నుంచి అనంతరాజుపేట వరకు 10 కిలోమీటర్లు సంకల్ప పాదయాత్రను రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు సంకల్ప పాదయాత్ర నిర్వహించాయి. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తలపెట్టిన సంకల్ప పాదయాత్ర నవంబర్ 6వ తేదీ మొదలై 3647 కిలోమీటర్లు కొనసాగిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: