gas leakage: కడప ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్ కావటంతో రోగులు, సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది లీకేజీని అరికట్టారు. రోగులకు ఆక్సిజన్ అందించే సిలిండర్ రెగ్యులేటర్ వద్ద లీక్ కావటంతో ఒక్కసారిగా ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు అందరూ బయటకు పరుగులు తీశారు. కాసేపటి తర్వాత ప్రమాదం ఏమీ లేదని, అంతా లోపలికి వెళ్లాలని అధికారులు చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు.
Gas Leakage: రిమ్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ గ్యాస్ లీక్..అప్రమత్తమైన సిబ్బంది - kadapa district latest news
gas leakage: కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ లీకైంది. దీంతో రోగులు, సిబ్బంది పరుగులు తీశారు. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది గ్యాస్ లికేజీని అరికట్టారు.
Oxygen cylinder gas leak in rims