కడప ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట పొరుగు సేవల ఉద్యోగులను.. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆర్టీసీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించడం దారుణమని ఏఐటీయూసీ నాయకుడు బాదుల్లా అన్నారు.
రవాణా శాఖ మంత్రి ఎవరినీ తొలగించలేదంటూ చెబుతున్నా.. స్థానికంగా ఉన్న అధికారులు మాత్రం పొరుగు సేవల ఉద్యోగులను విధుల్లోకి రావద్దంటూ నోటి మాట ద్వారా చెప్పడం సరైంది కాదన్నారు. ఒక్కొక్కరు పదేళ్లుగా పని చేస్తున్నారని.. ఇప్పుడు వారిని తొలగిస్తే వారి కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.