ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో 'ఆపరేషన్ ముస్కాన్' ద్వారా 105 మంది చిన్నారులకు విముక్తి - కడప జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ తాజా వార్తలు

చిన్నపిల్లలను కార్మికులుగా చేయడం చట్టరీత్యా నేరమని.. అలా చేసేవారిని కఠినంగా శిక్షిస్తామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా 105 మంది పిల్లలకు విముక్తి కల్పించామని తెలిపారు. వారంరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.

operations muskan program in kadapa district
కడప జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్

By

Published : Jul 15, 2020, 6:53 AM IST

కడప జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 105 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ముఖ్యమంత్రి, డీజీపీ సవాంగ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విడిపించిన వారిలో 85 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని.. 20 మందిని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్​కు తరలించామని తెలిపారు.

ఆపరేషన్ ముస్కాన్ ప్రతి సంవత్సరం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. చిన్నపిల్లలను కార్మికులుగా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. లాక్ డౌన్ సమయంలో పనులు దొరకని కారణంగా చిన్నపిల్లలతో పనులు చేయించే అవకాశం ఉందన్నారు. జులై 14న ప్రారంభమైన ఈ కార్యక్రమం వారంరోజులపాటు జరుగుతుందన్నారు. దీనికోసం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేశామని తెలిపారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్​లు, ఫుట్​పాత్​లు, హోటళ్లు, ఆటో గ్యారేజీలలో బాలకార్మికులుగా పనిచేస్తున్న అనాథ బాలల కోసం తనిఖీలు చేపడుతున్నామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details