ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ .. బాల కార్మికుల గుర్తింపు - కడప జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్

పోలీసు శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. కడప జిల్లాలోని వివిధ దుకాణాల్లో, కర్మాగారాల్లో, వెల్డింగ్ షాపుల్లో, హోటల్స్ లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు.

operation muskan
ఆపరేషన్ ముస్కాన్

By

Published : May 19, 2021, 11:38 AM IST

రాష్ట్ర పోలీసు శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా కడప జిల్లాలో ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక శాఖ, గ్రామ, వార్డు కార్యదర్శులు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు.

దుకాణాల్లో, కర్మాగారాల్లో, వెల్డింగ్ షాపుల్లో, హోటల్స్ లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి.. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. వారందరికి కొవిడ్ నియంత్రణపై అవగాహన కల్పించారు. చదువుకోవాల్సిన వయస్సులో పిల్లలను బాల కార్మికులుగా మార్చడం నేరమని ఎస్పీ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 250 మంది బాల కార్మికులను గుర్తించినట్టు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details