కడప జిల్లా వ్యాప్తంగా 257 మంది చిన్నారులను జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విముక్తి కల్పించారు. రెస్క్యూ చేసిన వారిలో 252 మంది బాలురు కాగా, 5 మంది బాలికలున్నారని తెలిపారు. విముక్తి కల్పించిన వారిలో 237 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. తల్లిదండ్రులు, సంరక్షకులు లేని చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో ఉంచడం జరిగిందన్నారు.
'ఆపరేషన్ ముస్కాన్' ప్రతి సంవత్సరం కొనసాగుతుందన్నారు. చిన్న పిల్లలను బాల కార్మికులుగా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా పిల్లలు మాస్కులు లేకుండా తిరగకూడదన్న ఆదేశాలు ఉన్నాయన్నారు. విముక్తి కల్పించిన పిల్లలకు కరోనా టెస్టులు చేయించామన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీసు బృందాలను ఆపరేషన్ ముస్కాన్ కొరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.