ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపరేషన్ ముస్కాన్​.. 255 మంది బాలలు రెస్క్యూ

కడప జిల్లాలో వీధి, అనాథ, తప్పిపోయిన, బాల కార్మికులుగా ఉన్న బాలలను సంరక్షించేందుకు.. ఆపరేషన్ ముస్కాన్​ను నిర్వహించారు. 255 మంది పిల్లలను రెస్క్యూ చేసి.. తల్లిదండ్రులకు అప్పగించారు.

kadapa
కడపజిల్లాలో బాలలు రెస్క్యూ

By

Published : May 20, 2021, 10:56 PM IST

కడప జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. జిల్లాలో 255 మంది (బాలురు 237, బాలికలు 18) బాలలను రెస్క్యూ చేసి.. తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్పీ పర్యవేక్షణలో జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర శాఖల సిబ్బందితో కలిసి ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు.

రైల్వే స్టేషన్​లు, బస్ స్టాండ్​లు, హోటళ్లు, డాబాలు, గ్యారేజీలు, పరిశ్రమలు, వర్క్ షాపులలో బాలబాలికలను పోలీసులు రెస్క్యూ చేశారు. ఐసీడీఎస్, జిల్లా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పోలీస్ అధికారులు బాలబాలికలకు అల్పాహారం, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. వారికి కొవిడ్ రాపిడ్ టెస్ట్​లు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details