ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప రిమ్స్​లో ఓపీ సేవలు నిలిపివేత - కడప రిమ్స్ లో ఓపీ సేవలు నిలిపివేత

రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటివరకూ మూడు మాత్రమే నమోదైనా.. వైరస్‌ వ్యాప్తిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా లక్షణాలతో 24 గంటల్లో 11 మంది ఆసుపత్రుల బాటపట్టారు. కరోనాపై కడప జిల్లాలో వైద్యాధికారులు అప్రపత్తమయ్యారు. కడప రిమ్స్​లో నేటి నుంచి అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందించాలని నిర్ణయించారు.

only-emergency
only-emergency

By

Published : Mar 21, 2020, 9:51 AM IST

కడప రిమ్స్​లో ఓపీ సేవలు నిలిపివేత

కడప రిమ్స్​లో ఇవాళ్టి నుంచి కేవలం అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందించాలని వైద్యాధికారులు నిర్ణయించారు. ఈ నెలాఖరు వరకు ఓపీ సేవలు బంద్ చేయాలని తీర్మానించారు. కరోనా అనుమానంతో రిమ్స్ ఐసోలేషన్ వార్డులో చేరిన నలుగురికి నెగిటివ్ రాగా... మరో ముగ్గురి నివేదికలు రావాల్సి ఉంది. ఇప్పటికే సౌదీ, కువైట్ నుంచి వచ్చిన దాదాపు 2 వేల మందిని గుర్తించి వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

కరోనా వైరస్ ప్రభావంతో ఈనెల 22న దేశవ్యాప్తంగా ప్రజలంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో జన సమూహాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. ప్రధానంగా కడప జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)కి రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరకు ఔట్ పేషెంట్లు, మరో వెయ్యి మంది ఇన్ పేషెంట్లు వస్తుంటారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులను గణనీయంగా తగ్గించాలనే డీఎంఈ ఆదేశాలతో ఇవాళ్టి నుంచి రిమ్స్​లో సాధారణ వైద్య సేవలు నిలిపివేశారు. కేవలం అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్ తెలిపారు.

రిమ్స్​లో కరోనా వైరస్ వార్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజుకు వెయ్యికి పైగానే వచ్చే రోగులు సగానికి తగ్గిపోయారు. ఇన్ పేషెంట్ విభాగంలో కూడా రోగులు ఉండటం లేదు. ప్రత్యేక వార్డు సమీపంలోని రోగుల వార్డులన్నీ ఖాళీ అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ప్రభుత్వ వైద్యులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలు

ABOUT THE AUTHOR

...view details