రోజురోజుకూ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కడప రైతు బజార్లో చిన్న సైజు ఉల్లి కిలో రూ.40 కి ఇస్తున్నారు. మరి కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రూ.70 నుంచి రూ.80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.
నిన్నటి వరకూ ఉల్లి ధరలు అందుబాటులోనే ఉన్నాయి. అయితే ఇటీవలి వర్షాలకు ఉల్లి పంట ధ్వంసమైంది. మార్కెట్లోకి కొత్త సరకు రావడం లేదు. స్టాక్ తక్కువగా ఉండటంతో ఉల్లికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధర కూడా పెరిగిందంటున్నారు ఉల్లి వ్యాపారులు. ధర ఇలా పెరుగుతూపోతే ఉల్లిగడ్డలు కొనలేం అంటున్నారు ప్రజలు.