కడప జిల్లా వేంపల్లెలోని ఇడుపులపాయ ఒంగోలు ట్రిపుల్ ఐటీలో.. విద్యార్థుల ధర్నా రెండోరోజూ కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల 27న క్యాంపస్‌కు వస్తానని ఛాన్సలర్ కేసీ రెడ్డి ఫోన్లో మాట్లాడినా.. విద్యార్థులు వినిపించుకోవడం లేదు. సంస్థ డైరెక్టర్ జయరామిరెడ్డి, ఇతర అధికారులు, ఆర్కే వ్యాలీ పోలీసులు నచ్చజెప్పడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
దాదాపు 200 మంది విద్యార్థినీ, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించగా.. పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు తులసి రెడ్డి అక్కడకు చేరుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్యాంపస్ ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ధర్నా విరమించమని విద్యార్థులు భీష్మించుకుని కూర్చున్నారు. రాత్రి భోజనాలు చేయకుండా నిరసన తెలుపుతున్నారు.