కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లెలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా వీరభద్రస్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా, కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి ఎడ్ల యజమానులు పాల్గొన్నారు.
చాపాడు మండలంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు బండలాగుడు పోటీలను తిలకించారు. కేరింతలతో సందడి చేశారు. కర్నూలు జిల్లా బీఆర్ పల్లెకు చెందిన ఎం .నాగయ్య ఎడ్లకు ప్రథమ బహుమతి లభించింది.