ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండు వేసవిలోనూ.. కేసీ కాలువలో జలకళ - Ongoing water flow in the kc Canal in Kadapa

కడప జిల్లాలోని కేసీ కాలువలో జలకళ కొనసాగుతోంది. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి విడుదల చేసిన నీటితోపాటు నంద్యాల ప్రాంతంలో కురిసిన వర్షాలతో కుందూనదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఫలితంగా కేసీ కాలువలోకి నీరు చేరుతోంది.

kc canal
kc canal

By

Published : May 15, 2021, 7:00 AM IST

మండువేసవిలో కడప జిల్లా కేసీ కాలువలో జలకళ కొనసాగుతోంది. మైదుకూరు వద్ద ప్రధాన కాలువతోపాటు ఉపకాలువలు ఏటూరు, కొండపేట కాలువలో నీరు పరుగులు తీస్తోంది. కర్నూలు జిల్లా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి విడుదల చేసిన నీటితో పాటు నంద్యాల ప్రాంతంలో కురిసిన వర్షాలతో కుందూనదిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా కాలువలోకి నీరు చేరుతోంది. భూగర్భ జలాలు అభివృద్ధికి దోహదపడుతుంది. పశువులు ఆవులు గొర్రెల పెంపకందార్లకు ఉపయుక్తంగా మారింది.

గతేడాది ఏప్రిల్‌ 15వతేది వరకు నీటి సరఫరా కొనసాగగా ఈ ఏడాది మే నెల మూడోవారంలోకి ప్రవేశించినా.. నీటి సరఫరా కొనసాగుతోంది. తాగునీటి అవసరాల కోసం అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు నుంచి సరఫరాను నిలిపివేశారని, మరో రెండు రోజులు నీటి సరఫరా కొనసాగే అవకాశం ఉందని డీఈఈ బ్రహ్మారెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details