సీఎం జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో పదో రోజు సీబీఐ అధికారులు కడపలో విచారణ చేశారు. కడప జైలు అతిథిగృహంలో సాక్షులు, అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
వివేకాతో ఆర్థిక, ఇతర సంబంధాలున్న వ్యక్తులను అధికారులు విచారణకు పిలిపించారు. ఇవాళ కడప, పులివెందుల, కర్నూలుకు చెందిన ఆరుగురిని వారు ప్రశ్నించారు.