ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ - వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా పులివెందుల ఆర్ అండ్ బి అతిథి గృహంలో లింగాల మండలం అంబకపల్లెకు చెందిన మహేశ్వరరెడ్డి కుటుంబాన్ని అధికారులు ప్రశ్నించారు. వారి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

By

Published : Apr 14, 2021, 5:43 AM IST

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతోంది. కడప జిల్లా పులివెందుల ఆర్ అండ్ బి అతిథిగృహంలో జరిగిన విచారణలో లింగాల మండలం అంబకపల్లెకు చెందిన మహేశ్వరరెడ్డి కుటుంబాన్ని అధికారులు ప్రశ్నించారు. వారి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. గత మూడు రోజులుగా పులివెందుల మెగా సెల్ పాయింట్ యజమానితో పాటు మిల్క్ డైరీ నిర్వాహకులు, వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డిని విచారించారు. అలాగే వివేకా వ్యక్తిగత సహాయకుడు ఇనాయతుల్లాను ప్రశ్నించిన సీబీఐ అధికారులు మరికొంతమందిని విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి: ఉగాది వేడుకల్లో సీఎం జగన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details