సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ముస్లింల నిరసనలు రాష్ట్రంలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ముస్లింల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం వీటిని వెనక్కి తీసుకునేవరకూ తమ ఆందోళనలు ఆగవని హెచ్చరించారు.
కడప జిల్లాలో....
సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా కడప జిల్లా జమ్మలమడుగులో ముస్లింలు నిరహార దీక్షలు చేపట్టారు. మూడు వారాల పాటు ఈ దీక్షలు కొనసాగుతాయని ముస్లిం మత పెద్దలు తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం శాంతియుతంగా కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. మొదటి రోజు వైకాపా, తెదేపా నాయకులు హాజరై వీరికి సంఘీభావం తెలిపారు.
ప్రకాశం జిల్లాలో...
సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో పట్టణంలో మహిళలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాన రహదారి మీదుగా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీగా వెళ్లారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ , అంటూ నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు.
చిత్తూరు జిల్లాలో...
చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా కులమతాలకతీతంగా వంద అడుగులు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: