కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూనే... రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని వైకాపా లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో రాజకీయ పరిస్థితులను బట్టి... ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన సందర్భంగా... కాంగ్రెస్, భాజపా ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్రానికి అన్యాయం చేశారని చెప్పిన మిథున్‌రెడ్డి... 22 మంది వైకాపా ఎంపీలు బృందాలుగా ఏర్పడి శాఖల వారీగా ఎక్కువ నిధులు సాధించడానికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. దిల్లీలో వైకాపా లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ''ఈనాడు-ఈటీవి-ఈటీవి భారత్''తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం: మిథున్‌రెడ్డి - YCP MP Mithun Reddy
ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని వైకాపా లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే తమ ధ్యేయమని ఉద్ఘాటించారు. దిల్లీలో మిథున్‌రెడ్డి ''ఈనాడు-ఈటీవి-ఈటీవి భారత్'' ముఖాముఖీలో మాట్లాడారు.
వైకాపా లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి