కడప జల్లా రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. రాయచోటి నుంచి కడప వెళ్లే కంటైనర్ లారీకి బ్రేకులు ఫెయిల్ కావటం వల్ల.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్నిఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ఈశ్వరయ్య(40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చింతకొమ్మదిన్నె పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కడప రిమ్స్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
గువ్వలచెరువు ఘాట్‌రోడ్ వద్ద ప్రమాదం.. ఒకరు మృతి - గువ్వలచెరువు ఘాట్‌రోడ్ వార్తలు
కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్‌రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం
Last Updated : Dec 19, 2020, 8:42 PM IST
TAGGED:
Kadapa district news