Road accident: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గండికోట సమీపంలో ఇన్నోవా కారు ఆటోను ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈమెతోపాటు ఇద్దరు పిల్లలూ గాయపడ్డారు. గాయపడిన వారిని కడప రిమ్స్‌కు తరలించినట్లు జమ్మలమడుగు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ తిమ్మయ్య అనే వ్యక్తి భార్యా,ఇద్దరు పిల్లలతో పాటు తన అత్తతో కలిసి తిరుమల నుండి స్వగ్రామమైన గండికోటకు తిరిగి వస్తుండగా. గండికోట సమీపంలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో తిమ్మయ్య అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఇన్నోవా కారు, ఆటో ఢీ.. ఒకరు మృతి - వైయస్సార్ నేర వార్తలు
Road accident: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Road accident