కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా...మరో ఇద్దరు గాయపడ్డారు. కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరుకు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి వైపు నుంచి రాజంపేటకు వెళ్తున్న ఇన్నోవాను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.
కారును ఢీకొట్టిన లారీ... ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు - తాజాగా రాజంపేటలో రోడ్డు ప్రమాదం
ఇన్నోవా కారును లారీ ఢీకొనడంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా...మరో ఇద్దరు గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదం
ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా సూర్యపల్లికి చెందిన లారీ డ్రైవర్ విశ్వనాథ్ మృతి చెందగా ఇన్నోవాలో ప్రయాణిస్తున్న శబరి, రమణ గాయపడ్డారు. వీరిని ప్రథమ చికిత్స నిమిత్తం రాజంపేట ఆసుపత్రికి తరలించి...అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండీ...ఎరువుల విక్రయాల్లో లోపించిన పారదర్శకత