కడప జిల్లా మైదుకూరు సమీపంలోని కొత్తపాలెంలో ఒంటెద్దు బండి బండలాగుడు పోటీలు జరిగాయి. మైదుకూరప వీరాంజయనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు జిల్లాలోని ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, బద్వేలు, కర్నూలు జిల్లా నుంచి ఆళ్లగడ్డకు ప్రాంతానికి చెందిన వారు పాల్గొన్నారు. ఒంటెద్దు బండి కింది భాగంలో రాతి దూలాన్ని కట్టి ఈ పోటీలను నిర్వహిస్తారు. రైతులు ఉత్సాహంతో కేరింతలు వేస్తూ పోటీలను ఆస్వాదించారు.
ఆకట్టుకున్న ఒంటెద్దు బండలాగుడు పోటీలు - one_ox_stone_competitions_kadapa_maidhukuru
మైదుకూరు కొత్తపాలెంలో వీరాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఒంటెద్దు బండి బండలాగుడు పోటీలు ఆకట్టుకుంటున్నాయి. కడప జిల్లా నుంచే కాకుండా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి సైతం పోటీదారులు పాల్గొని తమ పందెం గిత్తలను బరిలోకి దించారు.
' ఆకట్టుకుంటున్న ఒంటెద్దు బండలాగుడు పోటీలు'