కడప జిల్లా రాయచోటి పట్టణ శివారులోని మైనారిటీ గురుకుల పాఠశాల వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేటవైపు నుంచి వస్తున్న ద్విచక్రవాహనాన్ని ... రాయచోటి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుండుపల్లి మండలం దాచయ్యగారిపల్లి గ్రామానికి చెందిన మదన్ మోహన్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ద్విచక్రవాహనం-కారు ఢీ... వ్యక్తి మృతి - kadapa district news updates
కడప జిల్లా రాయచోటి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనం-కారు ఢీ... వ్యక్తి మృతి