కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లి వెస్ట్ బీట్ లోని పందికుంటలో 20 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. రహస్యంగా అందిన సమాచారంతో బాలపల్లి వెస్ట్ బీట్రూట్లోని పందికుంట ప్రదేశంలో తనిఖీలు చేస్తుండగా...తమిళనాడుకు చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారని చెప్పారు.
లక్షన్నర విలువ చేసే ఎర్రచందనం పట్టివేత - redsandle seized at pandikunta
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాల పల్లి వెస్ట్ బీట్ లోని పందికుంట ప్రదేశంలో ఆటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పందికుంట ప్రదేశంలో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
లక్షన్నర విలువ చేసే ఎర్రచందనం పట్టివేత
వారినుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగలు 648 కేజీలు ఉన్నాయని చెప్పారు. వాటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. లక్ష 55వేలు అని తెలిపారు. ఎవరికైనా ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం తెలిస్తే అటవీశాఖ అధికారులు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి శ్రీనివాసులు రెడ్డితో పాటు వారి సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: