కడప - తాడిపత్రి జాతీయ రహదారిలో పందిళ్లపల్లె వద్ద ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పసుపులేటి సాయి గణేష్(39) అనే వ్యక్తి మరణించాడు. శేషయ్య అనే మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్సకోసం అతన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు కమలాపురానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..మరొకరికి తీవ్ర గాయాలు - road accident news
కడప జిల్లా కమలాపురం మండలం పందిళ్లపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి