ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 30, 2021, 6:07 PM IST

ETV Bharat / state

చిన్న వయసులో.. పెద్ద గుర్తింపు!

ఆటలాడుకునే వయస్సులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి పిట్ట కొంచెం కూత ఘనం అని.. అనిపించుకుంటున్నాడీ బుడతడు. ఏడాది పది నెలల వయసులో పండ్ల పేర్లు చెప్పగానే వాటిని గుర్తించడం.. వరుస ప్రకారం సామగ్రిని అమర్చడం వంటి పనులు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్.. ఆ బాలుడు ప్రతిభను చూసి ప్రశంస పత్రాన్ని అందించింది.

one and half year boy at kadap got India book of record
one and half year boy at kadap got India book of record

పట్టుమని రెండేళ్లు కూడా నిండలేదు.. అన్ని కూరగాయలను ఇట్టే గుర్తుపట్టేస్తాడు. పక్షుల కూతలు, జంతువుల అరుపులను అనుకరిస్తాడు.. శరీర అవయవాల పేర్లు చెప్పాగానే వెంటనే చూపిస్తాడు... ఏడాది పది నెలల బాలడు ఇలా చేయడం విడ్డూరంగా ఉంది కదా!

చిన్న వయసులో.. పెద్ద గుర్తింపు

కడప నగరానికి చెందిన పవిత్ర, లక్ష్మీకాంత్‌ దంపతులకు 2019 మే 24న శివ జషీత్‌ జన్మించాడు. చిన్నప్పటి నుంచి వయస్సుకు మించిన సామర్థ్యం ప్రదర్శిస్తుండటాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. అంతర్జాలంలో దృశ్యమాలిక (వీడియో) ద్వారా ఈ ఏడాది మార్చి 12న నిర్వహించిన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు కార్యక్రమంలో శివ జషీత్ ను బరిలో నిలిపారు. పక్షుల అరుపులు, వస్తువులు, వాహనాలు, పండ్లు, కూరగాయలు, జంతువులు, రంగులు, శరీర అవయవాల పేర్లు, పద్యాలతో కూడిన నృత్యం, ఆంగ్ల అక్షరాలను తెలపడంలోనూ విశేష ప్రతిభ కనబరిచాడు. ఏడాది పది నెలల వయసులోనే ఇలా సత్తా చాటడాన్ని గుర్తించిన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు పతకం, ప్రశంసా పత్రాన్ని పంపినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details