కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పురపాలికలోని 8,9 వార్డుల్లో పర్యటించారు. పురపాలిక, ఇతర శాఖల అధికారులు, వాలంటీర్లతో కలిసి వార్డులకు చేరుకున్న ఎమ్మెల్యే అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురుగు, తాగునీటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా వంద కోట్లతో ఇంటింటికి శుద్ధి జల పథకానికి డిసెంబరు 26న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా శంఖుస్థాపన చేయబోతున్నట్లు ప్రకటించారు.
డిసెంబరు 26న.. ఇంటింటికి శుద్ధి జల పథకం ప్రారంభం - ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
కడప జిల్లా మైదుకూరులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా... వంద కోట్లతో ఇంటింటికి శుద్ధిజల పథకానికి డిసెంబరు 26న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా శంఖుస్థాపన చేయబోతున్నట్లు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
TAGGED:
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి