కడప జిల్లా కోడూరులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. బాధితురాలిని కడప కొవిడ్ ఆసుపత్రిలో తరలించేందుకు గాను అంబులెన్స్ రాగా...వాహనాన్ని చూడగానే భయంతో వృద్ధురాలు కుప్పకూలింది. వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. వృద్ధురాలి కుటుంబసభ్యులు విదేశాల్లో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.
అంబులెన్స్ చూడగానే...ఆయువు వదిలింది ! - అంబులెన్స్ చూడగానే...ఆయువు వదిలింది
కడప జిల్లా కోడూరులో కరోనా సోకిన ఓ వృద్ధురాలు అంబులెన్స్ చూడగానే ప్రాణాలు విడిచింది. బాధితురాలిని కొవిడ్ ఆసుపత్రికి తరలించే క్రమంలో ఈ ఘటన జరిగింది.కరోనా భయంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
అంబులెన్స్ చూడగానే...ఆయువు వదిలింది !