రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కడపలోని ఏఎస్ఆర్ నగర్లో ఓబులమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. భార్య దేహం వద్ద ఆమె భర్త కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. దంపతులకు బంధువులు ఎవరూ లేకపోవడంతో స్థానికులే చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు.
భారీ వర్షాలకు వృద్ధురాలు మృతి - కడపలో భారీ వర్షాలు
భారీ వర్షాలకు కడపలోని ఏఎస్ఆర్ నగర్ నీట మునిగింది. రాత్రి నుంచి కురుస్తున్న వానలకు ఓబులమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమెకు భర్త మినహా బంధువులెవరూ లేకపోవడంతో స్థానికులు పెద్ద మనసుతో చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు.
వరదల ధాటికి వృద్ధురాలి మృతి
మరోవైపు వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇదీ చదవండి: కళ్లెదుటే జలసిరి.. ఒడిసిపట్టక చేజారి!