కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ(Badvel by election counting) రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ మేరకు బద్వేలు(Badvel) ఏపీ గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. 4 హాళ్లలో కౌంటింగ్ ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారికి కేతన్ గార్గ్ మీడియాకు తెలిపారు. మధ్యాహ్నం లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.
Badvel by election: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి : రిటర్నింగ్ ఆఫీసర్
బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు(Badvel by election counting)నకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. పది రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందన్నారు.
Badvel by election
281 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 28 టేబుళ్లు ఏర్పాటు చేశామని కేతన్ గార్గ్ తెలిపారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచి ఉన్నాయన్న ఆయన.. రేపు ఉదయం ఎనిమిది గంటలకు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో వాటిని తెరుస్తామన్నారు. బద్వేలు ఉపఎన్నిక పోలింగ్ శాతం 68.37 గా ఉందని ఆర్వో తెలిపారు. పది రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు. వర్షం పడిన కౌటింగ్‌కు ఏలాంటి ఇబ్బందులు లేవన్నారు.
ఇదీ చదవండి