కడప జిల్లా రాజంపేటలో విజిలెన్స్ ఎన్ఫోఫోర్స్మెట్ , లీగల్ మెట్రాలజీ అధికారులు పలు దుకాణాలపై సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. దుకాణాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో కడప పొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్, రైల్వేకోడూరు, రాజంపేట వంటి పట్టణాలలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 24 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరకులను విక్రయిస్తే కఠిన చర్యలు చేపడుతామని అధికారులు వ్యాపారులను హెచ్చరించారు.
కిరాణా దుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు - కడపలో దుకాణాలపై అధికారులు దాడి
లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలను నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కడప జిల్లాలో పలు దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు.
officers rids on shops in cadapa