ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరం జలాశయం నుంచి కొనసాగుతున్న నీటివిడుదల - మైలవరం జలాశయం నుంచి పెన్నాకు నీటి విడుదల

రాష్ట్రంలో జలాశయాలు నిండుకుండలా మారాయి. గరిష్ఠ సామర్థ్యానికి చేరుకుంటున్నాయి. కడప జిల్లా మైలవరం జలాశయంలో నీటి నిల్వ 6 టీఎంసీలు దాటగా.. అధికారులు పెన్నా నదికి నీటి విడుదల చేస్తున్నారు.

mylavaram reservoir
మైలవరం జలాశయం

By

Published : Oct 22, 2020, 7:06 AM IST

కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటి విడుదల కొనసాగుతోంది. జలాశయంలో నీటి నిల్వ 6 టీఎంసీలు దాటింది. బుధవారం సాయంత్రం వరకు 30వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. రాత్రి నుంచి 17వేల క్యూసెక్కులకు తగ్గించినట్లు జలాశయ ఏఈ గౌతంరెడ్డి తెలిపారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.

మూడు రోజులుగా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్రావతి, పెన్నా నదుల నుంచి జలాశయానికి వరద వచ్చి చేరుతోంది. నీటి నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుకోనుండటంతో.. అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details