REMOVED THE STATUE OF YOGI VEMANA: ప్రజాకవి యోగి వేమన పేరు మీద ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ఆయన విగ్రహాన్నే తీసి పక్కన పెట్టేశారు అధికారులు. ఆ స్థానంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2006లో వేమన పేరుతో వైయస్‌ఆర్ జిల్లా కడపలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో ఆటవెలది పద్యాలతో.. సమాజంలో నైతిక విలువలు, మూఢ నమ్మకాలు, కుల వివక్ష వంటివాటిపై జనంలో చైతన్యం తీసుకొచ్చిన ప్రజాకవి వేమన. ఆయన గొప్పతనాన్ని చాటేలా అప్పట్లో ప్రధాన పరిపాలన భవనం ముందు వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అక్కడ కూడా వైఎస్సార్ విగ్రహమే.. మరి ఎవరిది తీశారో తెలుసా??
REMOVED THE STATUE OF YOGI VEMANA IN KADAPA : రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాల పేర్లు మార్చడం, గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన విగ్రహలను తొలగించడం లాంటివి చాలానే జరిగాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చి.. వైఎస్ రాజశేఖర్ పేరును పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పటంలో రోడ్ల విస్తరణ పేరుతో ప్రజల ఇళ్లను కూలగొట్టిన ప్రభుత్వం.. వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం తొలగించలేదు. ఇప్పుడు ఏకంగా కడప జిల్లాలో ప్రజాకవి యోగి వేమన పేరు మీద ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని తీసి.. ఆ స్థానంలో వైఎస్సార్ విగ్రహం పెట్టారు.
REMOVED THE STATUE OF YOGI VEMANA
ఇప్పుడు విశ్వవిద్యాలయ అధికారులు అత్యుత్సాహంతో ఆ విగ్రహాన్ని తొలగించి గేటు పక్కన పెట్టారు. ఆ స్థానంలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని రాయలసీమ విద్యార్థి సమాఖ్య (ఆర్‌వీఎస్) రాష్ట్ర కార్యదర్శి మల్లెల జగదీష్, అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి వి.గంగా సురేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి పేర్కొన్నారు.
ఇవీ చదవండి: