ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిక్ సూచీలు సరిలేవు.. ముందున్న మలుపులు తెలీవు..! - కడప జిల్లాలో ఒరిగిపోయిన దిక్​ సూచికలు వార్తలు

కడప జిల్లాలో మైదుకూరు ప్రొద్దుటూరు రహదారి మధ్య దెబ్బతిన్న సూచికలను పట్టించుకున్న నాథుడే లేడు. 18 కిలోమీటర్ల పరిధిలో ని జాతీయ రహదారిపై పలుచోట్ల సూచికలు ఒరిగిపోయాయి. వీటిని అధికారులు సరిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Damaged indicators between the road
కడప జిల్లాలో రహదారి మధ్య దెబ్బతిన్న సూచికలు

By

Published : Feb 19, 2020, 7:52 PM IST

కడప జిల్లాలో రహదారి మధ్య దెబ్బతిన్న సూచికలు

రహదారి ప్రమాదాల నివారణలో సూచికల పాత్ర ఎంతో ఉంది. ముందున్న మలుపులు, స్పీడ్​ బ్రేకర్స్​లను గుర్తించి ముందుకు వెళ్లడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటిది కడప జిల్లాలోని మైదుకూరు - ప్రొద్దుటూరు రహదారి మధ్య దెబ్బతిన్న సూచికలు మాత్రం పునరుద్ధరణకు నోచుకోలేదు. 18 కిలోమీటర్ల పరిధిలోని జాతీయ రహదారిపై పలుచోట్ల సూచికలు ఒరిగిపోయాయి. రోజులు గడుస్తున్నా.. సంబంధిత అధికారుల చర్యలు మాత్రం శూన్యం. రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించేందుకు చర్యలు తీసుకున్న అధికారులు.. సూచికల పునరుద్ధరణకు చొరవ చూపించలేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. వాటిని సరిచేయాలని కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details