లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 30 మంది కడప వాసులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. చిన్నచౌక్ పరిధిలోని శాంతినగర్ చెందిన 30 మంది.. తమ బంధువు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నంద్యాల రెడ్ జోన్ ప్రాంతానికి వెళ్లిన వారందరిని.. యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు కేంద్రానికి అధికారులు తరలించారు. ఎవరైనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న 30 మంది.. క్వారంటైన్‌కు తరలింపు - Quarantine latest news
రెడ్ జోన్ ప్రాంతంలో ఉండే బంధువు అంత్యక్రియల్లో పాల్గొన్న 30 మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిబంధనలు అతిక్రమించినవారిని క్వారంటైనకు తరలింపు