కాల్వలో దూకిన ఇద్దరు ఉద్యోగులు.. కారణమేంటి? - kadapa-district latest news
18:57 September 15
కడప జిల్లా ఇడమడకలో విషాద ఘటన
కడప జిల్లా రాజుపాలెం మండలం టంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంజనాదేవి రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె పాఠశాలలో ఉపాధ్యాయుడిగా లక్ష్మారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. వీరువురూ దువ్వూరు మండలం ఇడమడక గ్రామం సమీపంలోని కేసీ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో అంజనాదేవి మృతి చెందగా.. లక్ష్మారెడ్డిని స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజు.. సిబ్బందితో చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. వీరిద్దరూ కాల్వ వద్దకు ఎందుకు వచ్చారు? ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై దువ్వూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.