కడప జిల్లా మైదుకూరు ఎంపీడీవో సభా భవనంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహార ఆవశ్యకతపై సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మల్లేష్ సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు పాలు, గుడ్లు విధిగా తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సకాలంలో దొరికే పండ్లను తినాలన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీయకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు.
మైదకూరు ఎంపీడీవో కార్యాలయంలో పోషకాహార మాసోత్సవం - nutritional month awareness programme
గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారంపై కడప జిల్లా మైదకూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోషకాహార మాసోత్సవం సందర్భంగా సభలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అవగాహన కార్యక్రమం
TAGGED:
పోషకాహార మాసోత్సవం