ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం నా ఇష్టం నా రాష్ట్రం' అంటే కుదరదు: తులసిరెడ్డి - తులసి రెడ్డి తాజా వార్తలు

కార్పొరేషన్ల నుంచి నిధులను మళ్లించకుండా... రాష్ట్ర బడ్జెట్ ద్వారా నిధులను మళ్లించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రంగుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. నా ఇష్టం నా రాష్ట్రం అంటే కుదరదని... రాజ్యంగబద్ధంగా పరిపాలన సాగించాలని కోరారు.

n.thulasi reddy commenting on cm vahana mitra scheem in kadapa district
n.thulasi reddy commenting on cm vahana mitra scheem in kadapa district

By

Published : Jun 4, 2020, 4:46 PM IST

సీఎం నా ఇష్టం నా రాష్ట్రం అంటే కుదరదు: తులసిరెడ్డి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ , కాపు, బ్రాహ్మణ, క్రిస్టియన్ కార్పొరేషన్ల నుంచి వచ్చే నిధులను వాహనమిత్రకు మళ్లించారని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. కార్పొరేషన్ నుంచి నిధులు మళ్లించకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి నగదు కేటాయించి... వాహన మిత్రకు ఇవ్వాలని అన్నారు. వాహన మిత్రకు, అమ్మ ఒడికి సంబంధించి ఇంకా నాలుగు లక్షల మంది లబ్ధిదారులు అనర్హులుగా ఉన్నారని చెప్పారు. వాహన మిత్ర ఓనర్లకే కాకుండా డ్రైవర్లకూ వర్తించాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు. రంగులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని.... నా ఇష్టం నా రాష్ట్రం అంటే కుదరదని మండిపడ్డారు. రాజ్యాంగ పరంగా... చట్ట ప్రకారం పరిపాలన సాగించాలని సూచించారు. భవిష్యత్తులోనైనా ఒక జీవో ఇచ్చేముందు చట్ట పరిధిలో ఉందా లేదా అన్న విషయం తెలుసుకొని పరిపాలన కొనసాగించాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details