ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలు ముగిశాక.. నోటిఫికేషన్ ఇచ్చినా స్వాగతిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. కడప జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కొన్నిచోట్ల ఇద్దరు నేతలున్న నియోజకవర్గాల్లో సయోధ్య కుదిర్చే విధంగా చర్చలు జరిపారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినా స్వాగతిస్తాం: సజ్జల - notifications for mptc elections are welcomed says sajjala ramakrishna reddy
పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినా స్వాగతిస్తామని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.కడప జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినా స్వాగతిస్తామం: సజ్జల
ఎస్ఈసీ వ్యవహారశైలి చూసే అందరికీ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం జరుగుతోందన్నారు. ఎన్నికల కోడ్‌తో చాలావరకు పథకాలు ఆగిపోయాయని తెలిపారు.