ఆంధ్రప్రదేశ్లో దళితులకు, మైనారిటీలకు రక్షణ, న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. భూ వివాదంలో తనకు న్యాయం జరగలేదని ఆత్మహత్యకు యత్నించిన అక్బర్ బాష కుటుంబాన్ని ప్రొద్దుటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి దాష్టికాలు జరగలేదని తెలిపారు. సివిల్ విషయంలో బాధితునికి న్యాయం చేయాల్సిన పోలీసులు...స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకున్నాక కూడా న్యాయం చేయక పోవడంపై హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి వైకాపా పెద్దలు పంచాయతీ చేసి, ప్రభుత్వం సాయం అందనివ్వకుండా చేసి అక్బర్ భాషాకు న్యాయం జరగకుండా చేసారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా డీజీపీ ఈ వ్యవహారం పై స్పందించాలని, బాధితులకు న్యాయం చేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
EX MP HARSHA: జగన్ జోక్యం చేసుకున్నా న్యాయం చేయడం లేదు: మాజీ ఎంపీ హర్షకుమార్ - కడప జిల్లా వార్తలు
ఆంధ్రప్రదేశ్లో దళితులకు, మైనారిటీలకు రక్షణ, న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. అక్బర్ బాష విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకున్నాక కూడా పోలీసులు న్యాయం చేయక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ హర్షకుమార్