ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాంసం కోసం జనం బారులు - కడపలో లాక్ డౌన్

ఆదివారం కారణంగా... మాంసం దుకాణాలు కిటకిటలాడాయి. కడపలో పోలీసులు అనుమతించిన ప్రాంతాల్లోనే మాంసం విక్రయాలు జరిగాయి. తెల్లవారుజామునుంచే దుకాణాల వద్ద జనం బారులు తీరారు.

nonveg sales in kadapa
మాంసం కోసం జనం బారులు

By

Published : May 3, 2020, 3:18 PM IST

లాక్ డౌన్ కారణంగా కడపలో పోలీసులు కేటాయించిన ప్రాంతాల్లోనే మాంసం విక్రయాలు కొనసాగుతున్నాయి. నగరంలోని సీఎస్​ఐ మైదానం, గాంధీ నగర్ పాఠశాల, మున్సిపల్ మైదానం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామునే మాంసం విక్రయాలు ప్రారంభమయ్యాయి. వీటికోసం ప్రజలు బారులు తీరారు. మైదానాలు నిండిపోయాయి. పోలీసులు ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చినందున చాలామందికి మాంసం దొరక్క నిరాశగా వెనుదిరిగారు.

ABOUT THE AUTHOR

...view details